జనం న్యూస్.సెప్టెంబర్2. సంగారెడ్డి జిల్లా.హత్నూర.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ఆవుల రాజిరెడ్డి,రాష్ట్ర మైనార్టీ విభాగం కార్యదర్శి ఎం.ఎహకీమ్ అన్నారు.మంగళవారం హత్నూర మండలంలోనితుర్ కలఖానాపూర్ తార్కాన్ పేట్ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలోచేరారు చేరినవారు విక్రమ్ యాదవ్.అజయ్ యాదవ్ బిక్షపతి కృష్ణంరాజు రఘు ఆంజనేయులు హిమాయత్ పటేల్ నాగేష్ కృష్ణ, శ్రీకాంత్ సురేందర్ కృష్ణ నర్సింలుతో పాటు20మంది బీ ఆర్ఎస్ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి ఘనంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈసందర్భంగా నర్సాపూర్ మున్సిపల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై ప్రజలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సైనికులుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కరుణాకర్ రెడ్డి,మండలపార్టీ అధ్యక్షులు కర్రె కృష్ణ,మాజీ సర్పంచ్ కొన్యాల వెంకటేష్.కోటంలవెంకటేష్ నర్సింహారెడ్డి యాదగౌడ్ సతీష్ నాగారం నర్సింలు శ్రీకాంత్ మణిదీప్ వివిధగ్రామాల నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.