జనం న్యూస్- సెప్టెంబర్ 3- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
వినాయకచవితి నవరాత్రులను పురస్కరించుకొని నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలోని కొత్త బ్రిడ్జి వద్ద నెలకొల్పబడిన గణేశుడి మండపం వద్ద గణేష్ యూత్ కొత్త బ్రిడ్జి ఆధ్వర్యంలో బుధవారం అన్న ప్రసాద వితరణ కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గణేష్ ఉత్సవకమిటి సభ్యులు పలువురు మాట్లాడుతూ.. అన్ని దానల కన్నా అన్నదానం గొప్పదని,ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తులకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తాతరావు,వాల్య నాయక్,పుల్యా,శంకరయ్య,శ్రీను,అరుణ్ కుమార్,ఈశ్వర్,వినోద్,అశోక్,ప్రదీప్,జీవన్,సంతోష్,వెంకటేష్,పండు మరియు కొత్త బ్రిడ్జి యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.