(జనం న్యూస్ 3 సెప్టెంబర్ ప్రతినిధి కాసిపేట రవి)
భీమారం మండల కేంద్రంలోని రావి చెట్టు కాలనీ లో సాయిరాం యూత్ గణేష్ ఉత్సవ సమితి ఆద్వర్యంలో నిర్వహిస్తున్న 50 వ గణేష్ నవరాత్రి వార్షికోత్సవ మహోత్సవ వేడుకలలో భాగంగా బుధవారం రోజున లక్ష్మీ గణపతి హోమం కార్యక్రమం , సామూహిక అన్న ప్రసాద భోజన కార్యక్రమాలు నిర్వహించారు, ఈ రోజు 50 సంవత్సరాల వేడుకలలో భాగంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు , హోమాలు జరుపుకోవడం చాలా సంతోషం గా ఉందనీ వారు తెలిపారు, భీమారం మండలం కోదండ రామాలయ ప్రధాన అర్చకులు తిరుణగిరి కన్నయ్య, తిరుణగిరి ప్రవీణ్, సంతోష్ఆచార్యుల ఆధ్వర్యంలో హోమ కార్యక్రమాలు నిర్హహించారు ,భీమారం మండల ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో , పాడి పంటలతో వర్దిల్లాలనీ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమం లో సాయిరాం యూత్ ఉత్సవ సమితి సభ్యులు,భక్తులు,గ్రామ ప్రజలు, కాలనీ వాసులు అదీక సంఖ్య లో పాల్గొన్నారు.