జనం న్యూస్ సెప్టెంబర్ 04(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-క్రీడలు మానసిక వికాసానికి, శారీరక ధృడత్వానికి సహాయపడడమేకాకుండా విద్యార్థుల్లో పోటీతత్వాన్ని స్నేహపూరిత వాతావరణాన్ని పెంపొందిస్తాయని మునగాల మండల ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్,ఎంఈఓ వెంకటేశ్వర్లు అన్నారు.బుధవారం మునగాల మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కలకోవాలో ఎస్ జి ఎఫ్ క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..విద్యార్థినులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని,క్రీడలు దేహదారుఢ్యానికి దోహదం చేస్తాయన్నారు.శారీరక, మానసిక బలాన్ని పెంచే క్రీడల పట్ల బాల్యం నుంచే ఆసక్తి పెంచుకోవాలన్నారు. అంతేకాకుండా ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తితో ఆడి, గెలుపోటములను సమానంగా స్వీకరించాలని సూచించారు.ఓటమి గెలుపునకు నాంది పలుకుతుందని గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో జడ్.పి.హెచ్.ఎస్ కల్ కోవా ప్రధానోపాధ్యాయులు తేజరాం సారు, క్రీడల ప్రధాన నిర్వాహకులు పప్పుల వీరబాబు గారు, ఏ ఏ పీ సి చైర్మన్ పనస లక్ష్మీ శంకర్, మాజీ సర్పంచ్ చిర్ర శ్రీనివాస్, సిపిఎం నాయకులు మండవ వెంకటాద్రి, మండవ వీరబాబు, కాంగ్రెస్ నాయకులు మండల చంద్రయ్య, గెజిటెడ్ హెడ్మాస్టర్ లు మైనం శోభన్ బాబు, కొల్లు శ్రీనివాస్, పందిరి నర్సిరెడ్డి, పీడీలు కళ్యాణ్, కవిత ,గోవిందరెడ్డి, పాషా, నాగేశ్వరరావు, గురవయ్య, తదితరులు పాల్గొన్నారు.