జనం న్యూస్ సెప్టెంబర్ 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో విద్యార్థులకు సైబర్ డ్రగ్స్ నేరాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని ఎస్సై జక్కుల పరమేశ్వర్ అన్నారు నేరలు ఆన్లైన్ మోసాల పై విద్యార్థినులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపరిమిత వ్యక్తులు ఫోన్ చేస్తే స్పందించవద్దన్నారు మీయొక్క బ్యాంకు ఖాతా ఆధార్ కార్డు వివరాలు ఎవరికీ తెలియపరచొద్దు మీకు అత్యవసరంలో 100 కు డైల్ చేయవలెను సైబర్ నేరానికి 1930 కి వెంటనే ఫోన్ చేయాలని అన్నారు సామాజిక మాధ్య మాల్లో మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని విద్యార్థినులు మంచిగా చదువుకోని మీయొక్క తల్లిదండ్రులు గురువులు పేర్లను నిలబెట్టాలి చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలి అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ కుమారస్వామి కానిస్టేబుల్ రవీందర్ పోలీస్ సిబ్బంది పాఠశాల ప్రధానోపాధ్యాయులు శేఖర్ బాబు ఉపాధ్యాయులు విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు…