జనం న్యూస్ 04 సెప్తెంబెర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరంలోని వైఎస్ఆర్ నగర్ ప్రాంతంలో పేకాట ఆడుతున్న 8 మందిపై కేసు నమోదు చేసినట్లు విజయనగరం టూ టౌన్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు.బుధవారం వైఎస్ఆర్ నగర్ ప్రాంతంలో పేకాట ఆడుతున్నట్లు వచ్చిన సమాచారంతో శిబిరంపై దాడి చేశామన్నారు. 8 మందిని పట్టుకొని వారి నుంచి రూ.17,595, 8 సెల్ ఫోన్లు, 52 పేక మొక్కలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు.