అలరించిన సాంస్కృతి కార్యక్రమాలు.
జనం న్యూస్ సెప్టెంబర్ 04;సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గ పరిధిలోనీ ఇంద్రేశం గ్రామంలో పిఎన్ఆర్ టౌన్షిప్ కాలనీ అధ్యక్షులు నాగరాజు ఉపాధ్యక్షుడు మున్నూరు రవి మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నవరాత్రుల్లో భాగంగా బుధవారం సాయంత్రం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇంద్రేశం గ్రామ పెద్ద మాజీ సర్పంచ్ పట్లోళ్ల రామచంద్ర రెడ్డి, పటాన్ చెరువు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, పిఎన్ఆర్ కాలనీ స్థాపకుడు పట్లోళ్ల నరసింహారెడ్డి, యువ నాయకుడు పట్లోళ్ల హరీష్ రెడ్డి విచ్చేసి గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. పిఎన్ఆర్ టౌన్షిప్ కాలనీలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి రోజున గణనాధుని ప్రతిష్టించి నవరాత్రుల పూజలు పిఎన్ఆర్ టౌన్షిప్ కాలనీ వాసుల సమక్షంలో ఘనంగా నిర్వహిస్తున్నామని పట్లోళ్ల నరసింహారెడ్డి తనవంతుగా గణనాధుని ఇప్పించడం జరిగిందన్నారు., ఇంద్రేశం గ్రామ పెద్ద మాజీ సర్పంచ్ పట్లోళ్ల రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు నిర్వహించి సుమారు 5000 మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించి గణనాథుని కృపకు పాత్రులయినారు. కార్యక్రమంలో భాగంగా ఫ్యూజన్ డాన్స్ స్టూడియో డాన్స్ టీచర్ అలేఖ్య గారిచే చిన్నారులతో నృత్య ప్రదర్శనలు భక్తులను అలరింప చేశాయి. అనంతరం గ్రామ పెద్దలు వారి చేతులమీదుగా చిన్నారులకు షీల్డ్ లను బహూకరించారు.ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.వచ్చే సంవత్సరం పిఎన్ఆర్ టౌన్షిప్ కాలనీ ప్రజల సమక్షంలో మట్టి గణపతిని ప్రతిష్టించి అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించుకుందామని వారు అన్నారు. గణనాధుని ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నామని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సినియర్ నాయకురాలు మన్నే లక్ష్మి, మాజీ వార్డ్ మెంబర్ పిఎన్ఆర్ టౌన్షిప్ కాలనీ అధ్యక్షుడు నాగరాజు, ఉపాధ్యక్షుడు మున్నూరు రవి, గోపాల్,పవన్, విక్రమ్, శ్రీను,సంతోష్ రెడ్డి,భూమ్ రెడ్డి,సుమన్ చారి,అనిల్ గౌడ్, రంజిత్ రెడ్డి,అరవింద్, వెంకట్ తమ్మిశెట్టి, బొర్రా నరేష్, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, పిఎన్ఆర్ కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.