ఎన్ఎస్పి కెనాల్ వద్ద వినాయకుల నిమజ్జనానికి అనుమతులు లేవు
నిమజ్జన సమయంలో చెరువులు,వాగుల వద్దకు చిన్నపిల్లలను తీసుకపోవోదు
శాంతియుత వాతావరణంలో గణేష్ నిమజ్జన కార్యక్రమను నిర్వహించుకోవాలి
గణేష్ నిమజ్జనంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు
ఎస్సై.ప్రవీణ్ కుమార్ మునగాల మండలం
జనం న్యూస్ సెప్టెంబర్ 05(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-
వినాయకుడి నిమజ్జనోత్సవాల్లో భాగంగా ఊరేగింపు సమయంలో డీజేలకు అనుమతి లేదని మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ గురువారం ఒక పత్రిక ప్రకటనలో స్పష్టం చేశారు.నిబంధనలను అతిక్రమించి డీజేలను ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.నిమజ్జన సమయంలో చెరువులు, వాగుల వద్దకు చిన్నపిల్లలను తీసుకుపోరాదని సూచించారు.అదేవిధంగా మునగాల మండల కేంద్రంలోని ఎన్ఎస్పి కెనాల్ వద్ద వినాయకుల నిమజ్జనాలకు అనుమతి లేదని ఈ విషయాన్ని మండల ప్రజలు గమనించాలని ఎస్సై సూచించారు.మండల ప్రజలు శాంతి భద్రతలను కాపాడుతూ సాంప్రదాయ బద్ధంగా ఉత్సవాలను నిర్వహించాలని ఎస్సై సూచించారు.