ఉద్యోగ విరమణ అభినందన కార్యక్రమం
జనం న్యూస్ సెప్టెంబర్ 4 చిలిపిచేడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపితేడు మండలంలో చిట్కుల్ గ్రామానికి చెందిన శ్రీ రామచంద్రారెడ్డి గారికి బుధవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా శ్రీ రామచంద్రారెడ్డి గారికి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు మరియు షష్టిపూర్తి మహోత్సవం ఘనంగా నిర్వహించారు శ్రీ దమ్మున్న గారి రామచంద్రారెడ్డి 40 వసంతాల పాటు సుదీర్ఘకాలం ఉపాధ్యాయునిగా విద్యార్థి లోకానికి సేవలందించిన కార్యదర్శులు ఉపాధ్యాయ వృత్తిలో అంకితభావం నిబద్ధత సమయపాలనను ఆభరణాలుగా ధరించిన నిరాడంబరుడు తోటి ఉపాధ్యాయులను విద్యార్థులను విద్యావ్యవస్థను కుటుంబంగా భావించి ఆప్యాయంగా పలకరించే రామచంద్రుడు ఈ విషయాన్ని అయినా చెప్పడం కాకుండా ఆచరించి చూపే మార్గదర్శి ఆదర్శప్రాయలు ఎందరో విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా ఉద్యోగస్తులుగా వివిధ రంగాలలో ప్రముఖులుగా తీర్చిదిద్దిన ధన్యజీవి ఉపాధ్యాయుల సమస్యలను తీర్చడంలో ముందుండే దమ్మున్న నాయకుడు శ్రీ దమ్మున్న గారి రామచంద్రారెడ్డి గారికి హృదయపూర్వక ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు వివిధ మండలాలకు చెందిన ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్య అతిథిగా డీఈవో రాధాకృష్ణ మరియు ఎంఈఓ విటల్ అభినందించారు రాధాకృష్ణ చిలిపి చెడు మండలం చండూరు ప్రాథమిక పాఠశాలలో విద్యను విద్యార్థులకు ఎంతో ప్రేమానురాగాలతో నిర్వహించి వారి ప్రేమను తీసుకున్నారు చండూరు గ్రామంలో ఐదుగురు ఉపాధ్యాయులతో ఎంతో ప్రేమగా ఉండేవారు రమేష్ బాబు విశ్వేశ్వర్ రామచంద్రయ్య నారాయణ ఈ ఐదుగురు ఎంతో అన్న తమ్ముళ్ల వాళ్ల అనుబంధం విడదీయరానిది విద్యారంగంలో 40 సంవత్సరాలు ప్రశంసనీయమైన సేవను అందించిన తర్వాత పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు శ్రీ రామచంద్రారెడ్డి ఆయన మార్గదర్శక శక్తిగా స్ఫూర్తి దాయక నాయకుడిగా మరియు చాలామందికి మార్గదర్శకుడిగా ఉన్నారు నైతిక వృత్తికి తనను తాను అంకితం చేసుకున్నారు ఆయన నాయకత్వంలో పాఠశాల అనేక మైలురాళ్లను సాధించింది వాటిలో అవార్డులు ఉత్తమ ఉపాధ్యాయులు ఎన్నో అవార్డులు రావడం జరిగింది సంగాయిపేట ఫంక్షన్ హాల్ లో సిబ్బంది విద్యార్థులు పూర్వ విద్యార్థులు మరియు ప్రముఖుల సమక్షంలో వీడ్కోలు కార్యక్రమం జరిగింది భావోద్వేగా ప్రసంగాలు సాంస్కృతిక ప్రదర్శనలు మరియు సన్మాన కార్యక్రమాలు జరిగాయి పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు జ్ఞాపకాలు మరియు హృదయపూర్వక శుభాకాంక్షలు తమ కృతజ్ఞతలు తెలిపారు విద్యార్థులకు మరియు సమాజానికి వారి నిరంతర మద్దతు కృతజ్ఞతలు తెలిపారు ఆయన తన ప్రయాణంలో జ్ఞాపకాలను పంచుకున్నారు విద్యార్థులు శ్రేష్టత మరియు క్రమశిక్షణ కోసం కృషి చేయడం కొనసాగించాలని కోరారు చండూరు గ్రామంలో చదువుకున్నటువంటి విద్యార్థులను గుర్తు చేసుకున్నారు