పాఠశాల విద్యార్థులకు అన్న ప్రసాదం అందించిన బుర్ర ప్రసాద్ గౌడ్
జనం న్యూస్, సెప్టెంబర్ 04, జగిత్యాల జిల్లా,
మెట్ పల్లి: పట్టణంలో గల బ్రూక్లిన్ గ్రామర్ హై స్కూల్, అన్ని హిందూ ధర్మ పండగలను ఘనంగా జరుపుకుంటుంది అందులోని భాగంగా ఈ సంవత్సరం కూడా వినాయక చవితిని పురస్కరించుకొని విగ్రహా ప్రతిష్టపన చేసి ప్రతిరోజు అర్చకులచే పూజలు నిర్వహించారు, సాధారణంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు అనంగానే ప్రతి పల్లెలో పట్టణాల్లో యువత ఒక గ్రూపుగా ఏర్పడి మండపములు ఏర్పరచుకొని వినాయకుని ప్రతిమ ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తారు. కానీ జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణానికి చెందిన బ్రూక్లిన్ గ్రామర్ హైస్కూల్లో ప్రతి ఏటా వినాయకుని ప్రతిష్టించి ఘనంగా పూజలు నిర్వహిస్తూ పిల్లలందరికీ మన పండగల గురించి వాటి ప్రాధాన్యత గురించి వివరించడం జరుగుతుంది. ఈ నవరాత్రి ఉత్సవాల భాగంగానే ఈరోజు బ్రూక్లిన్ హై స్కూల్ విద్యాలయంలోని విద్యార్థుల అందరికీ అన్నప్రసాదనం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్రూక్లిన్ గ్రామర్ హై స్కూల్ ప్రిన్సిపల్ బుర్ర ప్రసాద్ గౌడ్, జయశ్రీ, మరియు ఉపాధ్యాయుల బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.