జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 4 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
రైతు భరోసా కేంద్రాలను రైతు బాధిత కేంద్రాలుగా మార్చిన ఘనుడు జగన్
కట్ట యూరియా కోసం రైతులు ఆర్బీకేల వద్ద పడిగాపులు పడేలా చేశాడు
గత ఎన్నికల్లో వైనాట్ 175 అన్న జగన్.. 2029 ఎన్నికల్లో వైనాట్ 11 అనడం ఖాయం : ప్రత్తిపాటి
“ తన పాలనలో రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని దేశంలో రెండోస్థానంలో నిలిపిన ఘనుడు నేడు కూటమిప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందని చెబుతుంటే నేలతల్లి సిగ్గుతో తలదించుకుంటోంది. రైతుభరోసా కేంద్రాలను రైతు బాధిత కేంద్రాలుగా మార్చి.. చిన్నచిన్న అవసరాలకు కూడా రైతుల్ని యాచించే స్థితికి తీసుకొచ్చిన రైతు ద్రోహి జగన్. న్యాయంగా రైతులకు దక్కాల్సిన విత్తనాలు.. ఎరువులు..యంత్రపరికరాలు.. టార్పాలిన్లను కూడా వైసీపీనేతలు దారిమళ్లించి సొమ్ముచేసుకుంటున్నా జగన్ ఏనాడు నోరెత్తలేదు. ధరల స్థిరీకరణ నిధి పేరుతో రైతుల్ని వంచించింది జగన్ కాదా? రీసర్వే పేరుతో రైతులకు భూ సమస్యలు తీసుకొచ్చింది జగన్ కాదా? వైసీపీప్రభుత్వం సకాలంలో రైతులకు ఎరువులు అందించిందన్న జగన్ మాటలు పచ్చి అబద్ధాలు. ఆనాడు కట్టయూరియా కోసం రైతులు వైసీపీనేతల్ని బతిమాలుకుంటూ, ఆర్బీకేల వద్ద పడిగాపులు పడ్డారు. రైతుల్ని కూడా కుల..మతప్రాంతాల ప్రాతిపదికన విభజించిన కుహాన రాజకీయనాయకుడు జగన్. ధాన్యం కొనుగోళ్లలో రైతుల్ని మోసగించి, ఆఖరికి వారికి చెల్లించాల్సిన డబ్బులు బకాయి పెడితే, కూటమిప్రభుత్వం వచ్చాక రూ.1674కోట్లు రైతులకు జమచేసింది వాస్తవం కాదా? కరువు మండలాల ప్రకటనలో కేంద్రాన్ని తప్పుదోవ పట్టించి రైతుల్ని మోసం చేసిన ఘనత వైసీపప్రభుత్వానిదే. పంటనష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వాలు అందించే ఫసల్ బీమా (పంటలబీమా) సొమ్మును జగన్ ప్రభుత్వం మూడేళ్లపాటు చెల్లించలేదని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా పార్లమెంట్ లో చెప్పింది నిజం కాదా? జగన్ రైతులకు చేసిన మోసం ఆకాశమంత.. ఐదేళ్లల్లో వారికి చేసిన సాయం మాత్రం గుప్పెడంత. 2029 ఎన్నికల్లో జగన్ కొత్త నినాదం వైనాట్ 11..జగన్ నరనరాన విధ్వేషం… అణువణువూ అహంకారమే. అందుకే కూటమిప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. నిత్యం తన అవినీతిమీడియాలో, పేటీఎమ్ బృందంతో ప్రజాప్రభుత్వంపై విషం చిమ్మకపోతే జగన్ కు మంచినీళ్లు కూడా మింగుడుపడవు. తన హాయాంలో సాగునీటి రంగాన్ని నిర్వీర్యం చేసిన జగన్.. నేడు ఏ ముఖం పెట్టుకొని చంద్రబాబు కష్టంతో పులివెందులకు చేరిన కృష్ణా జలాలకు హారతులిచ్చాడో తన నియోజకవర్గప్రజలకు సమాధానం చెప్పాలి. గతఎన్నికల్లో వైనాట్ 175 అన్న జగన్.. ఇప్పటికీ తన పద్ధతి.. విధానాలు మార్చుకోకుంటే 2029 ఎన్నికల్లో వైనాట్ 11 అనే కొత్తనినాదం ఎత్తుకోవడం ఖాయం అని మాజీమంత్రి ప్రత్తిపాటి ఒక ప్రకటనలో ఎద్దేవాచేశారు.