వినాయక శోభాయాత్ర లో డీజేల వినియోగంపై మరియు బాణాసంచా వాడకం పై నిషేధం
శాంతియుత ప్రశాంతమైన వాతావరణంలో అంగరంగ వైభవంగా వినాయక శోభయాత్ర నిర్వహించుకోవాలి
పోలీస్ కమిషనర్ బి. అనురాధ,
జనం న్యూస్, సెప్టెంబర్ 4, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )
సిద్దిపేట జిల్లాలో సెప్టెంబర్ 05, 06 వ తేదీ శుక్రవారం, శనివారం, నాడు జరగనున్న వినాయక నిమజ్జన కార్యక్రమం సందర్బంగా జరిగే శోభయాత్ర రూట్ లు మరియు నిమజ్జన ప్రదేశాలైన సిద్దిపేట పట్టణం కోమటి చెరువు, ఎర్ర చెరువు, గజ్వేల్ పట్టణం పాండవుల చెరువు, ప్రజ్ఞాపూర్ ఊర చెరువు, దుబ్బాక రామసముద్రం చెరువు, హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు, చేర్యాల కుడి చెరువుల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తుతోపాటు, పోలీసుపరంగా అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని జరిగిందని కమిషనర్ పేర్కొన్నారు. వినాయక శోభయాత్రలో డీజేల వినియోగంతోపాటు బాణాసంచా కాల్చడంపై నిషేధం విధించామన్నారు. అదేవిధంగా నిమజ్జనం కొరకు నిర్వహించే శోభాయాత్రలో పాల్గొనే భక్తులు దేవునిపై భక్తి శ్రద్ధలు భజన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ కార్యక్రమాలు నిర్వహించుకోవాలని సూచించారు శోభయాత్ర జరుగు ప్రదేశాలలో సీసీ కెమెరాల పరివేక్షణలో మరియు నిమజ్జనం ప్రదేశంలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వినాయక మండపాల అన్నిటికీ జియో ట్యాగింగ్ చేయడం జరిగింది. వినాయక శోభయాత్ర ఎక్కడ నుండి ఎక్కడికి వెళుతుంది జిపిఎస్ సిస్టం ద్వారా కంట్రోల్ రూమ్ నుండి పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా ప్రజలు ప్రజాప్రతినిధులు యువకులు వినాయక శోభాయాత్రను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. చెరువులు కుంటలు పొంగిపొర్లుతున్నందున చిన్నపిల్లలతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. విద్వేషపూరిత నినాదాలు, ప్రసంగాలు చేయడం లేదా పాటల వినియోగం వంటి చర్యలకు పాల్పడరాదని తెలిపారు. ఇట్టి నియమాలు ఉల్లంఘించిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలంతా భక్తి శ్రద్దలతో, మతసామారస్యాన్ని కాపాడుతూ ప్రశాంత వాతావరణంలో నిమ్మజ్జన కార్యక్రమం నిర్వహించుకోవాలని సూచించారు. ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్లు రెండు రోజులు 05, 06 శుక్రవారం, శనివారం రాత్రి 7 :00 గంటల నుండి ఉదయం 6:00 గంటల వరకు తొగుట, ఎన్సాన్ పల్లి గ్రామం నుండి వచ్చు వాహనదారులు సిద్దిపేట పట్టడానికి వెళ్లడానికి బైపాస్ కుడివైపు బీజేఆర్ చౌరస్తా నుండి సిద్దిపేట పట్టణానికి వెళ్లాలి.మెదక్, రామాయంపేట దుబ్బాక నుండి సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ అంబేద్కర్ చౌరస్తా సిద్దిపేట టౌన్ కు వచ్చే వాహనాలు సిద్దిపేట బైపాస్ రోడ్,ఎల్లమ్మ టెంపుల్, వేములవాడ కమాన్, నర్సాపూర్ చౌరస్తా, కుంకుమ మిల్లు రాజీవ్ రహదారి మీదుగా వెళ్లాలి.నాగదేవత టెంపుల్ చౌరస్తా నుండి సిద్దిపేట పట్టణానికి వచ్చే వాహనదారులు ఎల్లమ్మ టెంపుల్,వేములవాడ కమాన్మీదుగా సిద్దిపేట పట్టణానికి చేరుకోవాలి. రాజీవ్ రహదారి హుస్నాబాద్ కరీంనగర్ నుండి వచ్చే వాహనాలు రంగదాంపల్లి చౌరస్తా నుండి పొన్నాల వై జంక్షన్ దుద్దెడ టోల్గేట్ మీద నుండి హైదరాబాద్ వెళ్లాలి రంగదాంపల్లి చౌరస్తా నుండి సిద్దిపేట పట్టణంలోకి రావడానికి అనుమతి లేదు.వాహనదారులు పోలీసుల సూచనలు పాటించి ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్ల ద్వారా వెళ్లాలని సూచించారు