జనం న్యూస్ ; 4 సెప్టెంబర్ గురువారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;
తెలంగాణ అస్తిత్వం: మిలాదున్నభి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక రుస్తుం ఆర్ట్ గ్యాలరీలో గురువారం "సలామే మిలాదున్నభి" చిత్రాన్ని అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం ఆవిష్కరించారు. అందరికి మిలాదున్నభి ముబారక్ తెలియజేస్తూ, పండుగలు మానవాళిని సంస్కృతి ఐక్యతకు పుణరంకితం చేసి మానవ జీవితాలను కళావంతం చేస్తాయి. మిలాదున్నభి మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టినరోజు. అసమానతలు అరాచకాలు మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్న అరేబియాఎడారిలో జన్మించి మానవత్వం సమానత్వం పరిమళించే ఒయాసిస్సులా మానవాళి మానవతా విలువలను ప్రపంచానికి అనతికాలంలోనే తన గుణ గణ ఆచరణలతో శత్రువులను విమర్శకులను సహితం మంత్రముగ్దులను గావిస్తూ ప్రపంచానికి మహా ప్రవక్తగా సన్మార్గ మార్గ దర్శకుడైనాడు.మిలాదున్నభి శాంతి సహజీవనం ఐక్యత అభివృద్ధి అందించాలని ముఖ్యంగా సంయమనంతో ఒకరిభావాలు ఒకరు గౌరవించుకొని మానవాళికి ఆత్మీయభారతం ఐక్యత సహనం ప్రపంచానికి చాటాలని సలాం మిలాదున్నభి అందరికి సంతోషాలను పంచాలని మానవతా చిత్రకారులు రుస్తుం ఆకాక్షించారు. ఆర్ ఎ ఎఫ్ అధ్యక్షురాలు జులేఖరుస్తుం, అసిస్టెంట్ ప్రొఫెసర్ రుబినారుస్తుం, సాధిక్ ఎండి, మొహ్మద్ రహీమ్, పీబీ రజిత, తులసమ్మ, తదితరులు పాల్గొన్నారు.