విజేతలకు బహుమతి అందచేయడం జరిగింది
జనం న్యూస్, సెప్టెంబర్ 4, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )
మర్కుక్ మండల స్థాయి 69వ ఎస్జీఎఫ్ క్రీడోత్సవాలు ముగింపు సమావేశంలో విజేతలకు బహుమతి ప్రధానం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మర్కూక్ మండల విద్యాధికారి ఏ వెంకట్ రాములు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటలు విద్యార్థుల జీవితాలలో అతిముఖ్యమని పట్టుదల క్రమశిక్షణ ఆరోగ్యకరమైనపోటీ తత్వాన్ని పెంపొందిస్తాయని, ఆటలలో ఎలా ఇష్టంగా విజయం సాధిస్తున్నాము చదువులో సాధించడానికి ప్రణాళిక రూపొందించుకోవాలి అని విద్యార్థులకు సూచించారు. పిఆర్ టి యు మండల అధ్యక్షులు ఆర్. శ్రీనివాసరావు మాట్లాడుతూ శారీర ఆరోగ్యానికి , మనసుతో ఉల్లాసానికి ఆటలు దోహదపడతాయని విద్యార్థులందరూ కంప్యూటర్ గేమ్స్ వదిలిపెట్టి స్కూల్ గేమ్స్ ఆడిన ఉన్నత ఆదర్శాలను అలవర్చుకోవాలని , విజేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. మండల స్థాయి క్రీడలను అనేక వ్యయప్రయాసలకు పట్టుకొని విజయవంతంగా క్రీడలను పూర్తి చేయడానికి సహకరించిన దాతలు, బహుమతుల దాత, బబ్బూరి మల్లేశం గౌడ్ కి, రెండు రోజులు రుచికరమైన భోజనాన్ని అందించిన మోర్స్ కరుణాకర్ రెడ్డి కి మండల స్థాయి క్రీడా కమిటీ ధన్యవాదాలు తెలియజేసింది. ఈ కార్యక్రమంలో విజేతలకు బహుమతుల ప్రధానం అతిధుల చేతుల మీదుగా చేయబడింది. బాలబాలికలకు అండర్ 14, అండర్ 17, విభాగములలో వాలీబాల్ కబడ్డీ కోకో అంశాలలో బహుమతులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మర్కూక్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, వెంకటేశం, చేబర్తీ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు శంకర్ రెడ్డి, పాములపర్తి ప్రధానోపాధ్యాయ లతీ సైదా , పి ఆర్ టి యు మండలం అధ్యక్షులు శ్రీనివాసరావు,పిఆర్టియు ప్రధాన కార్యదర్శి తుమ్మ కుమార్ టిపిటిఎఫ్ ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, యూటీఫ్ అధ్యక్ష కార్యదర్శులు మల్లేశం బాల నరసయ్యలు, మండలంలోని వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు, స్థానిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు , రెండు రోజులపాటు ఆటలను విజయవంతంగా నిర్వహించిన పిడి రజిని, పియిటీ స్వామి, నీలాదేవి లకు మండల కమిటీ కృతజ్ఞతలు తెలియజేసింది.