జుక్కల్ సెప్టెంబర్ 4 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం పడం పల్లి గ్రామంలో గణేష్ నవరాత్రి సందర్భంగా గ్రామ జంగం కాలనీ వద్ద బాల గణేష్ మండలి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు మధ్యాహ్నము నుండి మండపం వద్ద భక్తులు గ్రామ ప్రజలు భారీగా తరలివచ్చి వినాయక స్వామిని దర్శించుకున్నారు అనంతరం ఏర్పాటు చేసిన అన్నదానంలో గ్రామ ప్రజలు భోజనం చేశారు చిన్నపిల్లలు పెద్దలు ఉత్సవంలో పాల్గొని కోలాటం భక్తి పాటలు పాడడం జరిగింది ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు విరాధర్ సుధాకర్ పంచయప్ప స్వామి రాజయ్యప్ప స్వామి బిరాధర్ చంద్రకాంత్ హనుమాజీ వార్ మహేష్ లక్సెట్టి ఓంకార్ పాల్గొన్నారు