జనం న్యూస్ సెప్టెంబర్ 5, వికారాబాద్ జిల్లా పరిగి పట్టణం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్ రెడ్డి రెండవ వర్ధంతి సందర్భంగా పరిగి పట్టణంలోని బృందావన్ గార్డెన్ లో రెండవ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి వారి సతీమణి కొప్పుల గిరిజా దేవి, మరియు కుమారులు పరిగి మాజీ శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి, కొప్పుల అనిల్ రెడ్డి, కొప్పుల ప్రతిమారెడ్డి, కొప్పుల దీప్తి రెడ్డి, కుమార్తె అర్చన రెడ్డి, కుటుంబ సభ్యులు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు, తద్వారా వివిధ మండలాల నుంచి గ్రామాల నుంచి పెద్ద ఎత్తున బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొనీ నివాళులర్పించారు.