జనం న్యూస్ 06 సెప్తెంబెర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకునిగా నియమితులైన పి.గోవింద రాజులు శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు ఏడీగా బాధ్యతలను స్వీకరించిన గోవిందరాజులను సమాచారశాఖ అధికారులు, సిబ్బంది అభినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేటట్లుగా ప్రచారం చేయాలని కోరారు. సిబ్బంది అంతా పరస్పరం సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు.