జనం న్యూస్ 06 సెప్తెంబెర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
ఉపాధ్యాయుల దినోత్సవం మరియు భారతరత్న, మాజీ ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని, 42వ డివిజన్,కామాక్షి నగర్,అయ్యన్నపేట చెరువు వద్దనున్న మున్సిపల్ నడక మైదానంలో అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రముఖ సాహితీవేత్త, ప్రొఫెసర్ డాక్టర్ డి.వి.జి. శంకరరావు, సంఘసేవకులు డాక్టర్ ఎ. ఎస్. ప్రకాశరావు మాష్టారు, త్యాడ వేణుగోపాలం మాష్టారు, కొల్లి సత్యం మాష్టారు ను సామాజిక కార్యకర్త, అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ వ్యవస్థాపకులు త్యాడ రామకృష్ణారావు (బాలు) సత్కరించారు.ఈసందర్భంగా ముఖ్య అతిధిగా హాజరైన ఎలక్ట్ గవర్నర్ ఎ. తిరుపతి రావు, డాక్టర్ డి.వి.జి. శంకరరావు మాట్లాడుతూ భారతరత్న, మాజీ ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ యావత్భారత దేశానికే గురువని,దేశానికి చేసిన సేవలు ఎనలేనివని, ఇటువంటి మహనీయున్ని ప్రతీఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని,ఆదర్శవంతమైన సమాజ నిర్మాణం కోసం విద్యార్థులకు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయులు చేస్తున్న కృషి మరువలేనిదని ఉపాధ్యాయుల సేవలను గూర్చి కొనియాడారు.
కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ పెద్దలు కోట్ల సత్యనారాయణ,తాడ్డి ఆదినారాయణ, పి. అప్పలరాజు,టి. రమణ,వై. నల్లమరాజు,జి. గోవింద రావు,కోట్ల ఈశ్వరరావు తదితర పెద్దలు హాజరయ్యారు.