జనం న్యూస్ సెప్టెంబర్ 06 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు నియోజకవర్గం
ఇంద్రేశం గ్రామ పరిధిలో పిఎన్ఆర్ కాలనీ రోడ్ నెంబర్ 15 లో గణనాధుని నవరాత్రులు చత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇంద్రేశం మాజీ సర్పంచ్ బండి శంకర్ విచ్చేసి గణనాథుని ఆశీస్సులు అందుకున్నారు. గణనాథుని శోభాయాత్రలో సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రఖ్యాత సంగీత కళాకారుడు జడల రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నవరాత్రుల్లో భాగంగా గణేష్ నిమర్జనం కార్యక్రమం లో నవరాత్రుల పూజలు అందుకున్న మొదటి లడ్డును చత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ కమిటీ మెంబర్ జగన్ గౌడ్ 1,12,000 కు ,2వ లడ్డు 35000 రూపాయలకు గోవింద్ రెడ్డి వెంకన్న కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా పిఎన్ఆర్ టౌన్షిప్ మాజీ అధ్యక్షుడు మురళి మాట్లాడుతూ ముందుగా లడ్డు కైవసం చేసుకున్న వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, పిఎన్ఆర్ కాలనీ వాసులందరూ ఆ గణనాథుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో , అష్టైశ్వర్యాలతో సుభిక్షంగా ఉండాలనీ ఆయన కోరుకున్నామన్నారు. అనంతరం తీన్మార్ వాయిద్యాల మధ్య వినాయకుడి విగ్రహాన్ని కాలనీలోని వీధులలో ఊరేగించారు. యువకులు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.డోలు సన్నాయి, మేళతాళాలు మధ్య వివిధ వేషధారణలు ధరించి కళాకారులు భక్తులను ఆకట్టుకున్నారు. బాణసంచా కాలుస్తూ, డప్పు వాయిద్యాల మధ్య నృత్యాలు చేస్తూ ఆనందోత్సాహాలతో ఊరేగింపుగా వినాయక ఘాట్‌కు వెళ్లారు. ‘గణపతి బొప్పా మోరియా’ అనే నినాదాలు చేస్తూ గణేష్ నిమర్జనం ప్రశాంతంగా ముగిసింది.ఈ కార్యక్రమంలో పి ఎన్ ఆర్ కాలనీ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.