జనంన్యూస్. 06. నిజామాబాదు.ప్రతినిధి.
నేడు ఉదయం 10 గంటల సమయంలో నిజామాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్ యందు ఏర్పాటు చేయబడినటువంటి శ్రీ ఓం గణేష్ మండలి వద్ద పూజా కార్యక్రమం నిర్వహించిన పూజా కార్యక్రమానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్., పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పూజా కార్యక్రమం అనంతరం వినాయకుడిని నిమజ్జనానికి తరలించడం జరిగింది.ఈ పూజా కార్యక్రమంలో నిజామాబాద్ ఆదనపు డీసీపీ (అడ్మిన్ ) జి. బస్వారెడ్డి, నిజామాబాద్ ఏసిపి రాజా వెంకట్ రెడ్డి, ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ మరియు రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్ , శేఖర్ బాబు , తిరుపతి , సతీష్ మరియు స్పెషల్ పార్టీ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది.