జనం న్యూస్ సెప్టెంబర్ 07(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-
మునగాల వైద్య ఆరోగ్య శాఖలో విధులు నిర్వహిస్తున్న ఏఎన్ఎం లకు పని భారాన్ని తగ్గించాలని ఎన్సీడీ ఆన్లైన్ సేవలను మినహాయింపు ఇవ్వాలని కోరుతూ శనివారం మండల పరిధిలోని రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్ఎంలు ఈ నెల 8వ తారీఖున కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాకు పర్మిషన్ కావాలని డాక్టర్ వినయ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…ఆరోగ్య కార్యకర్తలు గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్యం అందించేందుకు తాము కష్టపడుతున్నప్పటికీ ప్రభుత్వం ఆన్లైన్ సేవలతో పని ఒత్తిడి చేస్తుందని దీనివల్ల మానసిక ఇబ్బందికి గురవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 8వ తారీఖున కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి.అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కు అందజేస్తారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు.ఎం నరసమ్మ ,ఏ సుచరిత, ఎం లలిత,కే పద్మ ,
తదితరులు పాల్గొన్నారు.