జనం న్యూస్ సెప్టెంబర్ 6 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన
కాట్రేనికోన మండల పరిధిలో కందికుప్ప గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి వారి దేవాలయంలో వినాయక నవరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి శోభా యాత్రలో భాగంగా శనివారం ఆలయ ప్రాంగణంలో అన్న సమారాధన నిర్వహించారు అనంతరం జరిగిన 18 కిలోల లడ్డు వేలం పాటలో వ్యాపారి నూకల పెద్దకాపు 87 వేల100 రూపాయలకు కైవసం చేసుకున్నారు,ఆలయ కమిటీ వారు గణపతి లడ్డును పెద్దకాపు కుమారుడు నూకల మణికంఠ స్వామికి అందజేశారు,ఆలయ కమిటీ సభ్యులు,బంధువుల,అబిమానులు సమక్షంలో ఆయన గృహానికి తీసుకుని వెళ్లారు,ఈ కార్యక్రమంలో గ్రామ పుర ప్రముఖలు,గ్రామస్తులు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు