(జనం న్యూస్ చంటి 10 సెప్టెంబర్)
దౌల్తాబాద్ మండలం తిరుమలాపూర్ గ్రామం నందు రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా ఆదేశాల మేరకు బుధవారం నిర్వహించిన కీలకమైన ఆర్థిక అక్షరాస్యత,ఋణ సలహాలు మరియు సామాజిక భద్రతా పథకాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా లీడ్ బ్యాంకు సిద్దిపేట ఎఫ్ యల్ సి శివకుమార్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించబడింది. ఇట్టి అవగాహన సదస్సు లో గ్రామస్తులకు
ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన,ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన,అటల్ పెన్షన్ యోజన, బ్యాంకు ఖాతా RE-KYC ప్రక్రియ, సైబర్ భద్రత,సురక్షిత బ్యాంకింగ్ పద్ధతులు,నామినేషన్ వివరాల నవీకరణ,సుకన్య సమృద్ధి, బ్యాంకు ఖాతా నిర్వహణ,సాధారణ బ్యాంకింగ్ సౌకర్యాలు,డిజిటల్ అరెస్ట్ లు మొదలగు వంటి అంశాలపై మరియు వీటి ద్వారా కలిగే ప్రయోజల గురించి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.ఇట్టి సమావేశం నందు తోగుట సి యఫ్ ఎల్ స్వామి, గ్రామ పంచాయతీ కార్యదర్శి నరేష్, బ్యాంకు మిత్ర నర్సిములు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.