రాజీమార్గం రాజమార్గం
లోక్ అదాలత్ ద్వారా ఇరు వర్గాల కక్షీదారులు అంగీకారం తో సత్వర పరిష్కారం
కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని,డబ్బులను వృథా చేసుకోవద్దు
ఎస్సై ప్రవీణ్ కుమార్
జనం న్యూస్ సెప్టెంబర్ 12(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-
రాజీమార్గం రాజమార్గమని,కక్షలు, కార్పణ్యాలతో ఏమీ సాధించలేమని,రాజీపడితే ఇద్దరూ గెలిచినట్లేనని, లోక్ అదాలత్ ద్వారా ఇరు వర్గాల కక్షీదారులు అంగీకారం తో సత్వర పరిష్కారం పొందవచ్చు అని మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ అన్నారు.గురువారం ఒక పత్రికా ప్రకటనలో ఆయన మాట్లాడారు..ఈ నెల13వ తేదీన జరుగనున్న జాతీయ లోక్ అదాలత్ ను కక్షి దారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుందని తెలిపారు.రాజీపడదగిన కేసులలో క్రిమినల్ కంపౌండ బుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు,ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన నిర్వాహణ కేసులు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, బ్యాంకు రికవరీ,టెలిఫోన్ రికవరీ కేసులు,విద్యుత్ చౌర్యం,చెక్ బౌన్స్ కేసులో, వాహన ప్రమాద పరిహార కేసులు, చిట్ ఫండ్ కేసులు, ఇతర రాజీ పడ్డ దగిన కేసుల్లో కక్షిదారులు రాజీ పడాలని సూచించారు.రాజీ మార్గం రాజ మార్గ మని చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని,డబ్బులను వృథా చేసుకోవద్దని సూచించారు.జుడిషియల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్క కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.