జనం న్యూస్ సెప్టెంబరు 11 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
అనకాపల్లి రింగ్ రోడ్డు మెయిన్ రోడ్ నుండి కోల్డ్ స్టోరేజ్ వరకు రోడ్డుకి విరుపక్కల విస్తరణ చేయడానికి జీవీఎంసీ కోటి రూపాయలు నిధులతో పనులు చేపట్టడం జరిగిందని 84వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ మాదంశెట్టి నీలబాబు తెలిపారు. ఈరోజు ఉదయం రోడ్డు పనులు జరుగుతున్న విషయం తెలుసుకొని పరిశీలన చేశానని, కార్పొరేటర్ చిన్న తల్లి అభ్యర్థన మేరకు శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పిలా గోవింద సత్యనారాయణ కృషి ఫలితంగా ఈ నిధులు మంజూరు చేయడానికి కృషి చేశారని, రోడ్డుకి రెండు పక్కల విస్తరణ జరగడం వలన ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం ఉండదని, 84 వ వార్డు పరిధిలో మరో 5 కోట్లు తో సిమెంట్ రోడ్లు కాలువలకు ప్రతిపాదనలు ప్రధాన కమిషనర్ కు కార్పొరేటర్ చిన్నతల్లి వినతిపత్రం ఇవ్వడం జరిగిందని నీలబాబు తెలియజేశారు.//