జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 28 రిపోర్టర్ సలికినిడి నాగరాజు
పల్నాడు రాష్ట్ర అవినీతి నిరోధక విభాగ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పలనాడు జిల్లాకు చెందిన బిరుదు లక్షణాలు నియమిస్తూ నియామక ఉత్తరంలో రాష్ట్ర అధ్యక్షుడు అందజేశారు ఆదివారం తిరుపతిలో జరిగిన ప్రజాసంకల్ప వేదిక రాష్ట్ర నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం మహోత్సవ సందర్భంగా నూతన కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ప్రముఖ హైకోర్టు న్యాయవాది మధిరంగసాయి రెడ్డి అధ్యక్షతన రాష్ట్రంలోని ఎనిమిది విభాగాల్లో అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు నియమించారు ఈ సందర్భంగా అవినీతి నిరోధక విభాగం పల్నాడుకు చెందిన బిరుదు లక్షణాలు నియమిస్తూ నియామక పత్రాలను ఆయన అందజేశారు అదేవిధంగా ఆయా శాఖలకు సంబంధించి కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలను అందజేశారు వీరి పదవి కాలం రెండు సంవత్సరాలు పాటు కొనసాగుతుందని ఆయన ధ్రువీకరించారు రాష్ట్ర పరిధిలో జరుగుతున్న అవినీతి కార్యకలాపాలపై అవినీతి పాల్పడుతున్న అధికారులపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేస్తున్నారు అవినీతి నిరోధక విభాగ రాష్ట్ర ఎగ్జిట్ మెంబర్గా నియమితులైన బిరుదు లక్షణ మాట్లాడుతూ ఇంతటి బాధ్యత తనపై నమ్మకంతో అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు మధిరంగసాయిరెడ్డి కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు రాష్ట్ర పరిధిలో అవినీతిని నిర్మూలించేందుకు సహాయశక్తులకు చేస్తానని లక్షణ పేర్కొన్నారు