జనం న్యూస్ సెప్టెంబర్ 10: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల
మండల కేంద్రంలోని శివాజీ విగ్రహం వద్దబుదవారం రోజునా తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మూడ్ దయానంద్ నాయక్ మాట్లాడుతూ – “చాకలి ఐలమ్మ అణగారిన వర్గాల,కాకుండా సబ్బండ వర్గాల ప్రజల కోసం రజకారులు, దేశ్ముఖులు, భూస్వాములపై తిరుగుబాటు చేసి భూమి కోసం, భుక్తి కోసం, ఆత్మగౌరవం కోసం పోరాడారు. తన జీవితాన్ని త్యాగం చేసి పేద ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చారు” అని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక రజక సంఘం అధ్యక్షుడు మునిమాణిక్యం అశోక్, సభ్యులు మహేష్, సాయి కిషన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు శివన్నల శివకుమార్, జిల్లా డెలిగేట్ గడ్డం జీవన్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు జైనోద్దీన్, గన్నారపు రాజేశ్వర్, బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ నాయకులు దిబ్బ సుదర్శన్, అలాగే మోహన్ రెడ్డి, దేవుడు నర్సయ్య, సహదేవ్ సురేష్ యాదవ్, మంగలి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.