తక్షణమే స్పందించి బాధితులను పరామర్శించి, ఆర్థిక సహాయంకు నివేదించిన తహసీల్దార్ ఎం డి ముజీబ్
మద్నూర్ సెప్టెంబర్ 11 జనం న్యూస్
భారీ వరుస వర్షాలకు ఇంటి గోడ తడిసి హండే కేలూరు గ్రామంలో తుమ్మల్వార్ హన్మండ్లు, రుక్మిణి బాయి దంపతులపై వారి ఇంటి ప్రహారీ గోడ కూలి స్వల్ప గాయాలు అయినట్లు మండల తహసీల్దార్ ఎం డి ముజీబ్ గారు తెలిపారు.తక్షణం స్పందించిన అధికారులు, గ్రామ ప్రజలు, ప్రజా ప్రతినిధులు మద్నూర్ (CHC) హాస్పిటల్ కు వైద్యం నిమిత్తం తరలించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ గారు బాదితుల ఇంటినీ పరిశీలించి, అనంతరం హాస్పిటల్ వెళ్ళి బాధితులను పరామర్శించారు. వెంటనే వరద బాధితులకు అందించే ఆర్థిక సహాయంకి పంపారు.హాస్పిటల్ లో పరామర్శించిన వారిలో మండల గిర్దవార్ ఏం శంకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దారస్ సాయిలు, గ్రామ మాజీ ప్రజాప్రతినిధులు , గ్రామ పెద్దలు పాల్గొన్నారు