జనం న్యూస్ సెప్టెంబర్ 11 జగిత్యాల జిల్లా
బీర్ పూర్ మండలం కొల్వాయి గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ (హెల్త్ సబ్ సెంటర్)కార్యక్రమంలో భాగంగా 20 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన పల్లె దావకానాను ప్రారంభించి, రామాలయం కళ్యాణ మండపం లో గీతా కార్మికులకు 72 మందికి 100 శాతం సబ్సిడీ తో కాటమయ్య కిట్లను పంపిణీ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ .బీర్ పూర్ మండలానికి చెందిన 20 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 5 లక్షల 80 వేల రూపాయల విలువగల చెక్కులను పంపిణీ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ ఎమ్మెల్యే మాట్లాడుతూ కాటమయ్య కిట్లు గీతా కార్మికుల పాలిట శ్రీరామ రక్ష…గీతా కార్మికుల వృత్తి సాహసోపేతమైనది..గీతా కార్మికులకు ఎల్లప్పుడూ అన్ని విధాలుగా అండగా ఉన్నా…మండలంలో అన్ని కుల సంఘాల అభివృద్ధికి నిధులు కేటాయించడం జరిగింది.పల్లె దవాఖాన తో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయి.రాష్ట్రంలోనే అత్యధిక పల్లె దవాఖానలు జగిత్యాల నియోజకవర్గానికి మంజూరు అయ్యాయి.తుంగురు లో నూతనంగా కస్తూర్బా పాఠశాల ఏర్పాటు చేశాం.శాశ్వత భవనం కూడా నిర్మిస్తాం.ప్రభుత్వం తో కలిసి పనిచేస్తా జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కి కృషి చేస్తా…
రోళ్ళ వాగు ప్రాజెక్టు అభివృద్ధికి కృషి చేస్తున్నా,రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వం అధికారులు,మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్,ఎంపీ అరవింద్ గ సహకారం తో పూర్తి చేస్తా అన్నారు.ఈ కార్యక్రమంలో డి ఎం ఎచ్ ఓ ప్రమోద్,కేడిసిసి జిల్లా మెంబర్ ముప్పాళ్ళ రామచందర్ రావు,జిల్లా సంక్షేమ అధికారి సునీత,డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో భీమేష్,మహంకాళి రాజన్న,గౌడ సంఘం అధ్యక్షుడు రామచంద్రం గౌడ్,
మండలనాయకులు,ప్రజలు,అధికారులు, తదితరులు పాల్గొన్నారు.