జనం న్యూస్,కోహెడ మండలం,సెప్టెంబర్ 11,
కోహెడ మండలంలో తంగళ్ల పల్లి గ్రామ శివారులో దాదాపు 23,ఎకరాల విస్తీర్ణంలో 200,కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను. జిల్లా కలెక్టర్ కె.హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వ స్థలం చుట్టూ సర్వే చేసి హద్దులు వెయ్యాలని తహసీల్దార్ నీ ఆదేశించారు.తదనంతరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో మధ్యాహ్న భోజన ప్రక్రియను.జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. మెనూ లో బాగంగా మిక్సీడ్ వెజిటేబుల్ కర్రీ, పప్పు చారు చేసినట్లు వంట సిబ్బంది కలెక్టర్ కి తెలిపారు. విద్యార్థులకు సరిపడినంత, రుచికరమైన ఆహారాన్ని అందించాలని, ఎదిగే పిల్లలకు బలవర్ధక ఆహారాన్ని అందించాలని ప్రిన్సిపల్ ను ఆదేశించారు. విద్యార్థులతో మాట్లాడుతూ బాగా చదవాలని, బాగా తినాలని భవిష్యత్ లో ఉన్నత స్థాయి కి చేరాలని సూచించారు.కోహెడ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లో ఎరువుల సరఫరాలో యూరియా పంపిణీ ప్రక్రియను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లాలో మీ మండలానికి ఎక్కువ యూరియా పంపిణీ చేశామని. మీ మండలం లోని అన్ని సంఘాలలో యూరియా అందుబాటులో ఉందని ఎక్కడికెళ్ళినా తీసుకోవచ్చని రైతులకు తెలిపారు. రోజు వారిగా కూడా యూరియా వస్తుందని రైతులు అధైర్య పడవద్దని తప్పకుండా యూరియా అందిస్తామని హామీ ఇచ్చారు.జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం,సిద్దిపేట జిల్లా వారిచే జారీ చేయడమైనది.