193 రోజులకు ఆదాయం 10,25,254 రూపాయలు.
జనం న్యూస్ సెప్టెంబర్ 11 సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం అమిన్ పూర్ మున్సిపాలిటీ బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున దేవస్థానం ఆలయచైర్మన్ సుధాకార్ యాదవ్, ఆలయ ఈవో శశిధర్ గుప్త,జిల్లా దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు సమక్షంలో భ్రమరాంబిక మల్లికార్జున దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు.గురువారం ఆలయ మండపంలో నిర్వహించిన 193 రోజుల హుండీ లెక్కింపు లో భాగంగా హుండీ ఆదాయం రూ.10,25,254/- వచ్చిందని దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు మరియు చైర్మన్ సుధాకర్ యాదవ్, ఈవో శశిధర్ గుప్తా లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్,ఈవో శశిధర్, జూనియర్ అసిస్టెంట్ మల్లికార్జున్ ,అలయ ధర్మకర్తల మండలి సభ్యులు దండు రమేష్, మహేష్ కుమార్, ఎల్లయ్య, మల్లేష్, దీపక్ గౌడ్‌తో పాటు దేవదాయ శాఖ అధికారులు, సేవా సమితి సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.