జనం న్యూస్;11సెప్టెంబరు గురువారం; సిద్దిపేట నియోజకవర్గం ఇన్చార్జి వై.రమేష్ సిద్ధిపేట, సెప్టెంబర్ 5:
స్థానిక నలంద విద్యాలయంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా గురుపూజోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులను శాలువా, మెమెంటోలతో సత్కరిస్తూ, “మీరందించే విద్యాబుద్ధులను తూచా తప్పకుండా పాటించి దేశాభివృద్ధిలో మా వంతు పాత్రను పోషిస్తాం” అని ప్రతిజ్ఞ చేశారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గాలిపల్లి హరినాత్ థ్థ్ద్రోణాచార్యుడి మొదటి గురువు కౌరవులు పాండవులు ఒక అడవిలో ఆటలాడుతూ వాళ్లందరికీ విలువిద్దులు నేర్పించి మొదటి గురువు అయ్యాడని కొనియాడాడు గురుభక్తి గాథను వివరించి, విద్యార్థులు తమ గురువుల ఉపదేశాలను శిరసావహించి దేశ భవిష్యత్తుకు మహాశక్తులుగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు.అలాగే ఉపాధ్యాయులు చిన్న చిన్న కథల ద్వారా గురు–శిష్య సంబంధ బంధాన్ని విద్యార్థులకు వివరించారు.కార్యక్రమంలో డైరెక్టర్ నిత్యశ్రీ, సి.హెచ్. నాగరాణి, కే. అనిత, గౌసియా బేగం, అమ్రిన్, అమృత, శిరీష, అంజలి తదితరులు పాల్గొన్నారు.