జనం న్యూస్, సెప్టెంబర్ 12, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్, ములుగు విజయ్ కుమార్)
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ గ్రామం పాములపర్తి లో ఉల్లాస అనే కార్యక్రమంలో చదువురాని మహిళలు ను సర్వే చేసి అందరిని తీసుకొని పదిమందికి ఒక వీటి అంటే వాలంటరీ టీచర్ ట్యాగ్ చేయడం జరిగింది. చదువురాని మహిళలకు చదువు నేర్పించుట గురించి వీటిలను పిలిచి ఈరోజు శిక్షణ ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీసీ పద్మలత, మాట్లాడుతూ చదువురాని మహిళలకు అక్షర వికాసం అందులో భాగంగా చదువు నేర్పించి ఆ మహిళలకు మూడు నెలల తర్వాత పరీక్ష పెట్టి విద్య నేర్చుకొని బాగుపడాలని తెలియజేయడం జరిగింది, వివో ఏలు, బాలమణి, రవళి, సంతోష, అంగన్వాడి టీచర్స్, సుజాత, జై బునిసా, సంతోష, హెల్త్ డిపార్ట్మెంట్, ఏఎన్ఎం, సుగుణ, ఆశ వర్కర్, పద్మ,అనిత, ఈ ప్రోగ్రాం లో పాల్గొనడం జరిగింది.