లక్ష్మణ్ రావు దంపతుల విగ్రహాలను ఆవిష్కరించిన బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్
గుడిపల్లి మండలం రోలకల్ గ్రామానికి చెందిన విరనేని లక్ష్మణ్ దంపతుల విగ్రహాలను బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….లక్ష్మణ్ రావు మృతి పార్టీకి తీరని లోటు అని ఆయన అన్నారు.లక్ష్మణ్ రావు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది అని ఆయన భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు