బిచ్కుంద సెప్టెంబర్ 12 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ బిచ్కుంద లో IQAC మరియు ప్లేస్మెంట్ సెల్ సంయుక్తంగా ప్రో మైండ్స్ స్కిల్ కేటలెస్ట్ సంస్థ వారి చేత డిగ్రీ అనంతరం ఉద్యోగ అవకాశాలలో ఎలాంటి మెలుకువలు సాఫ్ట్ స్కిల్స్ మరియు కమ్యూనికేషన్స్ స్కిల్స్ పైన శిక్షణ కార్యక్రమం నిర్వహించారని కళాశాల ప్రిన్సిపల్ కే. అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. రిసోర్స్ పర్సన్ కే .గంగాధర్ గారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లో ఆత్మ న్యూనత భావం ,మరియు స్కిల్స్ పై అవగాహన లేమి తో పోటీ ప్రపంచం లో రాణించలేకపోతున్నారని వాటిని అధిగమించే స్కిల్స్ ను అవగాహన కల్పించి, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ జి రమేష్ బాబు, ప్లేస్మెంట్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ టి అశోక్ రావు గారు అధ్యాపక బృందం మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు