జనం న్యూస్ సెప్టెంబర్ 12,
వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ కుమార్ టెక్స్ టైల్స్ షాపుని, జహీరాబాద్ మాజీ ఎంపీ బిబి పటేల్ తో కలిసి టిక్స్ టైల్స్ షాపును ప్రారంభించి,అలాగే యజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపిన పరిగి మాజీ శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి. అనంతరం పరిగి మాజీ శాసనసభ్యులు మహేష్ రెడ్డి మరియు మాజీ ఎంపీ కి యజమాన్యం శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్, పార్థసారథి పంతులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి, నరోతం రెడ్డి, కౌన్సిలర్ కృష్ణ, శ్రీశైలం, రాకేష్, సాయి, తదితరులు పాల్గొన్నారు .