జనం న్యూస్,సెప్టెంబర్12,అచ్యుతాపురం:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మరింత సులభంగా, పారదర్శకంగా రేషన్ సరకులు అందించడానికి క్యూఆర్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డులు ప్రవేశపెట్టింది. అందులో భాగంగా ఈరోజు అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం సచివాలయం వద్ద కూటమి ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ ఆధారిత కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను కుటుంబ పెద్దలకు ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ అందించారు.ఈ కార్యక్రమంలో అధికారులు, గ్రామ ప్రజలు,యువకులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.