తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కర్రి సాయికృష్ణ
జనం న్యూస్,సెప్టెంబర్12,అచ్యుతాపురం:
నేపాల్‌లో గత కొన్ని రోజులుగా జరిగిన అల్లర్లు, ఊహించని ఉద్రిక్త పరిస్థితులు, ప్రాణభయంతో జీవిస్తున్న వాతావరణం మధ్యలో చిక్కుకున్న తెలుగువారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచిన తీరు నిజంగా ప్రతి తెలుగు హృదయాన్ని గర్వపడేలా చేసింది. ఆ సమయంలో దిక్కుతోచని స్థితిలో ఉన్న తెలుగువారికి, ఒక్క ఫోన్ కాల్ ద్వారా మంత్రి నారా లోకేష్ స్పందించడం, భరోసా ఇవ్వడం, వెంటనే ప్రభుత్వ త్రాంగాన్ని అలర్ట్ చేయడం ఒక తెలుగు వాడిగా గర్వపడుతున్నానని,217 మంది ఏపీ వాసులు నేపాల్‌లో 12 ప్రాంతాల్లో చిక్కుకున్నారని సమాచారం రాగానే, వారిలో ఎవరూ ప్రమాదంలో ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు చేరేలా చర్యలు తీసుకోవడం, ఆహారం, నీరు కల్పించడం, తాత్కాలిక వసతులు ఏర్పాటు చేయించడం ఇవన్నీ ఒక గొప్ప నాయకుని లక్షణాలని, మొదటి విడతలో 21 మందిని, తదుపరి విడతలో 144 మందిని ప్రత్యేక విమానాల ద్వారా స్వరాష్ట్రానికి సురక్షితంగా తీసుకువచ్చారని,మిగిలిన వారందరినీ కూడా స్వరాష్ట్రానికి చేరుస్తామని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చి, తన మాట నిలబెట్టుకున్నారని, అనంతపురం పర్యటనను సైతం రద్దు చేసుకుని, నేరుగా ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను వార్ రూమ్‌గా మార్చుకుని, క్షణక్షణం పరిస్థితిని పర్యవేక్షించారు. ఒకవైపు బాధిత కుటుంబాలతో నిరంతరం టచ్‌లో ఉండి వారికి ధైర్యం చెబుతూ, మరోవైపు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ, ఇంకోవైపు ప్రత్యేక విమాన ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ, నారా లోకేష్ చేసిన ఈ కృషి కి హ్యాట్సాఫ్ అని తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగానికి
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కర్రి సాయికృష్ణ ధన్యవాదాలు తెలిపారు.