జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
అన్నమయ్య జిల్లా స్థాయిలో గురువారం రాయచోటిలో జరిగినటువంటి కళా ఉత్సవ్ 2025 పోటీలలో నందలూరు నందు గల మహాత్మ జ్యోతి భాఫులే ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల, నందలూరు విద్యార్థిని అయినటువంటి హాసిని సోలో క్లాసికల్ నృత్య విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ నాగేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. అదే విధంగా జిల్లా స్థాయిలో నృత్య విభాగంలో దక్షణ్య కి ద్వితీయ బహుమతి రాగా, పాటల పోటీలలో హర్షితకు కూడా ద్వితీయ బహుమతి వచ్చిందని అన్నారు.విద్యార్థినులకు గొప్పగా శిక్షణ ఇచ్చి ప్రోత్సహించిన ఉపాధ్యాయురాలు భ్రమరాంభ కి మరియు హాసినికి పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు మరియు ప్రిన్సిపాల్ అభినందనలు తెలిపారు.