(జనం న్యూస్ చంటి సెప్టెంబర్ 12)
దౌల్తాబాద్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో మండల సోషల్ ఫోరమ్ ఆధ్వర్యంలో నూతనంగా పదోన్నతి పై దౌల్తాబాద్ బాయ్స్ హై స్కూల్ కు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు చామకూర అనిల్ కుమార్ సార్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు. రిటైర్డ్ ప్రిన్సిపాల్ గూళ్ల వెంకటయ్య సార్ గారి ఆదర్శ జీవన కథనం పుస్తకం వారికి అందచేశారు.అనంతరం వక్తలు మాట్లాడుతూ స్టేట్ రిసోర్స్ పర్సన్ గా బాధ్యతలు నిర్వహించిన సార్ మన కు ప్రధానోపాధ్యాయులు గా రావడం అదృష్టంగా భావిస్తున్నాము అన్నారు.ఇందులో భాగంగా ఉత్తమ ఉపాధ్యాయులు సావిత్రి మేడం, పదోన్నతి పొందిన లలిత, శ్రీనివాస్ సార్లకు శాలువాతో అభినందనలు తెలిపినారు..ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి కనకరాజు, రిసోర్స్ పర్సన్స్ భాస్కర్ రెడ్డి, నవీన్ , ఫోరమ్ కన్వీనర్ సత్యనారాయణ, కో కన్వీనర్ కిషన్ రెడ్డి, రవీందర్, దశరథము , పి డి విష్ణు,రమ, సి ఆర్ పి రాజు మొదలగు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.