జనం న్యూస్ సెప్టెంబర్ 13(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-
మునగాల మండలంలోని రెవెన్యూ గ్రామాల వారిగా నూతనంగా నియామకమైన గ్రామ పాలనఅధికారులు(జిపిఓ) లు శుక్రవారం బాధ్యతలు స్వీకరించినట్లు స్థానిక తహసీల్దార్ సరిత తెలిపారు, మండలానికి ఏడుగురు గ్రామ పాలన అధికారులు జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం నియామకం కాగా వారికి రెవెన్యూ గ్రామాల వారీగా బాధ్యతలు అప్పగించినట్లు ఆమె తెలిపారు, పి పాపయ్య గణపవరం కొక్కిరేణి, ఎస్ కే బాలసైదా మాధవరం నేలమర్రి, వి రవితేజ ఆకుపాముల,పి గోపీనాథ్ బరకత్ గూడెం, బి జానకి రాములు మునగాల, డి పద్మ తాడువాయి, కలకోవా, ఎస్ఎంపేట,ఎం అనంతయ్య రేపాల గ్రామ పాలన అధికారులుగా బాధ్యతలు స్వీకరించినట్లు ఆమె తెలిపారు.ఈ సమావేశంలో డిప్యూటీ తహసిల్దార్ సత్యనారాయణ,ఆర్ఐ లు రామారావు,మంజుల తదితరులు పాల్గొన్నారు.