. జనం న్యూస్ 13 సెప్టెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ
గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్. అని విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జార్జిరెడ్డి పి డి యస్ యూ జోగులాంబ గద్వాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 15 వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీ లో జరిగే బిగ్ డిబేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూజార్జిరెడ్డి జోగులాంబ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఎం ఏ ఎల్ డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రంగా పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది..పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా జార్జిరెడ్డి నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్య ధోరణి కారణంగా తెలంగాణలో విద్యా రంగం సంక్షోభంలో మునిగిపోయిందని వాపోయారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి రెండు ఏళ్లు కావస్తున్న ప్రభుత్వ విద్యా రంగ సమస్యల పరిష్కారానికి మాత్రం ఒక అడుగు ముందుకు పడలేదని అన్నారు. ప్రభుత్వ పెద్దలు,మంత్రులు తమ పర్యటనలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు కానీ విద్యార్థులకు ఇవ్వవలసిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను మాత్రం విడుదల చేయడం లేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో గత మూడేండ్ల నుండి సుమారు 8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను ఉన్నాయని అన్నారు. నిధులు విడుదల చేయాలని విద్యార్థి సంఘాలు,తల్లి తల్లిదండ్రులు కోరుతున్న ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తున్నది విమర్శించారు. మరోవైపు ప్రభుత్వ వసతి గృహాలు ప్రమాదకర స్థితిలో నిర్వహిస్తున్నారని తెలిపారు. వర్షాకాలము ప్రారంభమైతే పై పెచ్చులు ఊడి పడే ప్రమాదకర పరిస్థితుల్లో ప్రభుత్వ వసతి గృహాలు ఉన్నాయని, వాటికి సొంత భవనాలు నిర్మించాలనే కనీస ఆలోచన ప్రభుత్వంలో కలగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తక్షణమే పెండింగ్ స్కాలర్షిప్ & రియంబర్స్మెంట్ ఫీజు బకాయిలు విడుదల చేయాలని,విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని జార్జిరెడ్డి పి డి యస్ యూ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా నిర్వహించే బిగ్ డిబేట్ ను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జార్జిరెడ్డి పి డి యస్ యూ నాయకులు జిల్లా అధ్యక్షులు చాంద్ పాషా , ప్రధాన కార్యదర్శి సురేందర్ గౌడ్ , ఉపాధ్యక్షుడు తిరుమల్ , సహాయ కార్యదర్శి మల్లికార్జున్ , శివ , సోమశేఖర్ , ఇందు , హేమలత, సునీత , అంజలి, రాధ , తదితరులు పాల్గొన్నారు జార్జిరెడ్డి పిడియస్ యూజోగులాంబ గద్వాల జిల్లా కమిటీ