జనం న్యూస్ 13 సెప్టెంబర్ వికారాబాద్ జిల్లా.
కుల్కచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ ఎలోప్మెంట్ కేసులో నిందితులుగా ఉన్న సత్తయ్య మరియు రాజమ్మలను, తమ కుమారునికి ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా, మరియు ప్రేరేపించడం ద్వారా మైనర్ బాలికతో పారిపోవడానికి సహకరించినందుకు, విచారణ అనంతరం నేడు జ్యూడీషియల్ రిమాండ్‌కి పంపించడమైనది.ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేయునది ఏమనగా..మైనర్ వయసు ఉన్న పిల్లల ఎలోప్మెంట్, వివాహం లేదా దానికి సహకారించిన వారు POCSO చట్టం మరియు Child Marriage Prevention Act క్రింద శిక్షార్హులు.ఇలాంటి చర్యలు పిల్లల బాల్యాన్ని నాశనం చేసి వారి జీవితాలను నాశనం చేస్తాయి.తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించడం లేదా ప్రేరేపించడం చట్టరీత్యా నేరం.ఎవరైనా ఇలాంటి ఘటనలు గమనించినా లేదా బాధపడుతున్నా వెంటనే 1098 చైల్డ్ హెల్ప్ లైన్ (Toll Free Number) కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి.మైనర్ బాలికల తల్లిదండ్రులకు ప్రత్యేక సూచనలు చిన్న వయస్సులో పెళ్లిళ్లకు గురిచేయడం పిల్లల భవిష్యత్తును దెబ్బతీస్తుంది.మీ పిల్లల చదువు, ఆరోగ్యం, భవిష్యత్తు పట్ల శ్రద్ధ వహించండి.అనుమానాస్పద పరిచయాలు, సంబంధాలపై జాగ్రత్తగా ఉండండి.మీ పిల్లలు మైనర్ వయసులో ఎలోప్మెంట్లో చిక్కుకోకుండా కాపాడటం తల్లిదండ్రుల బాధ్యత.చట్టాన్ని ఉల్లంఘించే తల్లిదండ్రులు, పెద్దలు ఎవరైనా ఉన్నా, వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవు.
ప్రతి చిన్నారి భవిష్యత్తు భద్రత కోసం – చట్టాలను గౌరవించండి, బాధ్యతగా వ్యవహరించండి