మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'ముఫాసా: ది లయన్ కింగ్' (Mufasa the lion king) డిసెంబర్ 20, 2024న ఇండియాలో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కానుంది. బారీ జెంకిన్స్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం 2019లో లైవ్-యాక్షన్ ది లయన్ కింగ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని కొనసాగిస్తూ ప్రేక్షకులని అలరించబోతోంది. ‘ముఫాసా’కి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఇస్తున్నారు. మహేష్ బాబు వాయిస్ ఓవర్ లో రిలీజైన ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇస్తూ సూపర్ స్టార్ మహేష్ బాబు పోస్టర్ను నమ్రతా శిరోద్కర్ (Namrata Shirodkar) లాంచ్ చేశారు. టాకా పాత్రకు వాయిస్ హీరో సత్యదేవ్, టిమోన్ పాత్ర వాయిస్ ఇచ్చిన అలీ ఈ వేడుకలో పాల్గొన్నారు. పుంబా పాత్రకు బ్రహ్మానందం, కిరోస్ పాత్రకు అయ్యప్ప పి శర్మ వాయిస్ అందించారు. (Mahesh Babu Voice for Mufasa)