జనం న్యూస్ 13 సెప్టెంబర్ వికారాబాద్ జిల్లా.
వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం గట్టుపల్లి గ్రామంలో పవిత్ర సిలువకొండ పుణ్యక్షేత్రం యందు ఆదివారం 14-09-2025 నాడు జాతర కార్యక్రమం పరిగి విచారణ గురువులు ఆధ్వర్యంలో జరుగును. ఉదయం 9:00 గంటలకు పరిశుద్ధ జపమాల, 9:30 కి స్తుతి ఆరాధన,11:00 కు ఆగ్రా పీఠాధిపతులకు స్వాగతం సుమాంజలు, జూబ్లీ సిలువతో ప్రదక్షణ, 11:30 కి దివ్య బలి పూజ కార్యక్రమాలు జరుగును. కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని, సిలువకొండ కమిటీ సభ్యులు, భక్తులు కోరుకుంటున్నారు.