జనం న్యూస్ సెప్టెంబర్ 13, వికారాబాద్ జిల్లా
పరిగి నియోజకవర్గంలోని పరిగి పట్టణంలోని అగ్రోస్ రైతు సేవా కేంద్రం సెంటర్ దగ్గర రైతులు యూరియా కోసం బారులు తీరినారు. మాకు అదును దాటుతున్న యూరియా చాలీచాలని ఇవ్వడం ద్వారా పంటలకు సరిపోవడం లేదు. వర్షాలు ఎక్కువ కురవడం ద్వారా పంటలు ఎరుపు రంగుగా మారి పోవడం జరుగుతుంది. ఈ చాలీచాలని యూరియాతో పంటలు ఎలా దిగుబడి వస్తాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఇలాంటి యూరియా కొరత రాలేదని, ఈసారి యూరియా కొరత దానికి తోడు వర్షాలు ఎక్కువ పడడంతో అంతా పంటలు దిగుబడి రాదు అని, ఇకనైనా మా రైతులపై ప్రభుత్వం దృష్టి సారించి మాకు సరిపడా యూరియా అందించాలని రైతులు కోరుచున్నారు.