జనం న్యూస్ 13 సెప్టెంబర్( కొత్తగూడెం నియోజకవర్గం)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన రహదారులపై గత నాలుగు నెలలుగా మతిస్థిమితం కోల్పోయి సంచరిస్తున్న వ్యక్తిని స్థానిక యూట్యూబ్ ఛానల్స్, స్వచ్ఛంద సంస్థల చొరవతో అన్నం సేవ ఫౌండేషన్ ఆదుకుంది.సోనుసూద్ ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు టైలర్ సత్తార్, నిర్భయ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు & న్యాయవాది మల్లెల ఉషారాణి అందించిన సమాచారం మేరకు ఖమ్మం అన్నం సేవ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు అన్నం శ్రీనివాసరావు స్పందించారు. శుక్రవారం నాడు పోలీసు శాఖ, ప్రభుత్వ ఆసుపత్రి, జిల్లా మెజిస్ట్రేట్ (లీగల్) సహకారంతో లీగల్ ప్రాసెస్ పూర్తి చేసిన అనంతరం, ఫౌండేషన్ సొంత ఆంబులెన్స్‌లో ఆ వ్యక్తిని హైదరాబాద్ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్‌కు తరలించారు.ఈ కార్యక్రమంలో అన్నం సేవ ఫౌండేషన్ అధ్యక్షుడు అన్నం శ్రీనివాసరావు, సోనుసూద్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ కే సత్తార్ బాయ్ టైలర్ బృందం, సిటిజన్ భూపతి ఆశన్న ( యూట్యూబ్ న్యూస్ ఛానల్), భద్రాద్రి ఎక్స్‌ప్రెస్ ఛానల్ అధినేత సతీష్, బి 9 ఛానల్ మహిళా జర్నలిస్టు అపర్ణ, భద్రాద్రి టైమ్స్ అధినేత జర్నలిస్టు లక్ష్మణ్, నిర్భయ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు & న్యాయవాది మల్లెల ఉషారాణి, విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షుడు బుట్టి నరేష్ బృందం, త్రీ టౌన్ పోలీసు సిబ్బంది, అన్నం ఫౌండేషన్ సిబ్బంది పాల్గొన్నారు.స్థానిక యూట్యూబ్ యాజమాన్యాలు ఈ సేవా కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశాయి.