జనం న్యూస్, సెప్టెంబర్ 15, కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్ )
హుస్నాబాద్ మండల కేంద్రం నాగారం రోడ్డులోని శ్రీ రాజ్యలక్ష్మి కాన్వెంట్స్ హాల్లో ఆదివారం ఘనంగా జరిగిన సత్కార కార్యక్రమంలో ప్రముఖ తత్వవేత్త, ఆధ్యాత్మిక గురువు, మానవ విలువల పరిరక్షణ జాతీయ అధ్యక్షులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాగుల సత్యం గౌడ్ కి తెలుగు ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ మరియు శ్రీ విరాట్ విశ్వకర్మ విజ్ఞాన ఆధ్యాత్మిక ధార్మిక కళా పరిషత్ సంయుక్త పక్షాన జాతీయ స్థాయి విశ్వ గురువు పురస్కారం అందజేశారు.ఈ పురస్కారాన్ని సామాజిక, ఆధ్యాత్మిక రంగాల్లో విశేష సేవలందిస్తున్నందుకు, మానవతా విలువలను పెంపొందించే దిశగా నిరంతరం బోదనలు, సదస్సులు నిర్వహిస్తోన్నందుకు గుర్తింపుగా అందజేశారు.ఇ కార్యక్రమంలో సత్యం గౌడ్ కి పట్టు శాలువ కప్పి, గురు కిరీటం ధరింపజేసి, జ్ఞాపికలు, బొకేలు అందజేశారు.ముఖ్య అతిథులుగా ఈ వేడుకకు వివిధ రంగాల ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల వ్యవస్థాపకులు, అధ్యక్షులు, సిద్దిపేట గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి, బ్రహ్మశ్రీ డాక్టర్ కాళీ జగన్నాథం, విశ్వ విరాట్ కళారత్న బ్రహ్మశ్రీ పోలోజ్ రాజ్ కుమార్, పాడిశెట్టి విష్ణువర్ధనాచార్యులు, గురూజీ వీరధర్మరాజు స్వామి, ఇతరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఇ కార్యక్రమం లో పాల్గొన్న ప్రముఖులు మాట్లాడుతూ..సత్యం గౌడ్ వారు సమాజానికి ఉపయోగపడే రచనలు చేస్తూ, యువతకు మోటివేషన్ ఇస్తూ, విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి సదస్సులు నిర్వహిస్తున్నారని,ఆయన నిస్వార్థ సేవ భావన, మానవతా విలువల పరిరక్షణలో విశేషంగా నిలుస్తుందని కొనియాడారు.డాక్టర్ సత్యం గౌడ్ మాట్లాడుతూ:
"ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకొని సమాజసేవలో భాగస్వాములవ్వాలన్నారు. ఆధ్యాత్మిక చింతనతో మనసుకు ప్రశాంతత లభిస్తుందని, ఎవరికి హాని కలిగించకుండా నిస్వార్థంగా జీవించడమే మానవ జన్మను సార్ధకం చేస్తుందన్నారు.సేవాభావంతో మనం నవభారత నిర్మాణానికి పునాది వేయాలి" అని పిలుపునిచ్చారు.