జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలంలో త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉన్న గ్రామాలను కూటమి ప్రభుత్వంలో రాజంపేట టిడిపి నియోజకవర్గ ఇంచార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు ఆదేశాల మేరకు గుర్తించి 17 త్రాగునీటి బోర్లను టిడిపి ప్రభుత్వం మంజూరు చేయించడం జరిగినది. నేడు టంగుటూరు గ్రామ పంచాయతీలో కూటమి ప్రభుత్వ తరఫున మరియు రాజంపేట టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు ఆధ్వర్యంలో త్రాగునీటి బోర్లను వేయించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నందలూరు టిడిపి మండల అధ్యక్షులు జంగం శెట్టి సుబ్బయ్య టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణు గోపాల్ ,మండల క్లస్టర్ ఇంచార్జ్ పసుపులేటి ప్రవీణ్ కుమార్, తెలుగు మహిళ నియోజకవర్గ అధ్యక్షురాలు షర్మిల, బూత్ కన్వీనర్ మునగరామయ్య, టిడిపి నాయకులు ఈశ్వరయ్య రమేష్ నరసింహులు,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.