జనం న్యూస్ సెప్టెంబర్ 14: నిజామాబాద్ జిల్లా
ఏర్గట్ల మండలకేంద్రంలోశనివారం రోజునా తెలంగాణ ఉద్యమ కారుడు, ప్రజాసేవకుడు దయానంద్ ఆధ్వర్యంలో సకల జనుల సమ్మె దినోత్సవం కార్యక్రమం ను మండల కేంద్రం ఏర్గట్ల లో శనివారం కార్యక్రమం లో భాగంగా అమర వీరుల స్థూపం చిత్ర పటనికి పూల మాల వేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన మలి దశ ఉద్యమం లో తెలంగాణ వ్యాప్తంగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరు రోడ్డు మీదకు వచ్చి శాంతి యుతంగా ఉద్యమం చేసారని, కానీ శాంతి యుతంగానే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎంతో మంది బిడ్డలు ప్రాణాలు త్యాగాలు చేసారని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు త్యాగాలు చేసిన అమర వీరులు, ఉద్యమం చేసిన ప్రతి ఒక్కరు తమ గుండెల్లో నిలిచి ఉంటారని అయన అన్నారు.ఈ కార్యక్రమం లో దయానంద్, కవి రాజేందర్,మహేష్,వంశీ, శ్రీనివాస్, పురుషోత్తం, మోహన్, అంజన్న, శీను,నవీన్,మోతిన్, కాటిపల్లి చిన్న బాలయ్య,గన్నరపు దాసు, తదితరులు, పాల్గొన్నారు.